Header Banner

హీరో అజిత్ కు మ‌రోసారి త‌ప్పిన పెను ప్ర‌మాదం! రేసింగ్‌లో ప‌ల్టీలు కొట్టిన కారు.!

  Sun Feb 23, 2025 11:01        Entertainment

కోలీవుడ్ స్టార్ న‌టుడు అజిత్ కుమార్‌కు మ‌రోసారి పెను ప్రమాదం త‌ప్పింది. స్పెయిన్‌లో జ‌రుగుతున్న రేసింగ్‌లో ఆయ‌న కారు ప్ర‌మాదానికి గురైంది. దీంతో అజిత్ వాహ‌నం ట్రాక్‌పై ప‌ల్టీలు కొట్టింది. మ‌రో కారును త‌ప్పించే క్ర‌మంలో ఈ ప్ర‌మాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా, ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే ఆయ‌న కారులోంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు రావ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోను అజిత్ రేసింగ్ టీమ్ సోష‌ల్ మీడియా వేదిక‌గా షేర్ చేసింది. ఆయ‌న క్షేమంగానే ఉన్న‌ట్లు తెలిపింది. ఈ ప్ర‌మాదం త‌ర్వాత కూడా ఆయ‌న రేసింగ్ కొన‌సాగించారు. 

 

ఇది కూడా చదవండి: అరబ్ అడ్వొకేట్ తో చర్చించిన అనిల్ ఈరవత్రి! 17 మంది భారతీయులను ఉరిశిక్ష! 

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

ఇక గ‌త నెల‌లో దుబాయ్‌లో గ్రాండ్ ప్రీ రేస్ కోసం సాధ‌న చేస్తున్న స‌మ‌యంలో కూడా అజిత్ కారు ప్ర‌మాదానికి గురైన విష‌యం తెలిసిందే. ఆయ‌న కారు స‌మీపంలోని గోడ‌ను బ‌లంగా ఢీకొట్ట‌డంతో వాహ‌నం ముందు భాగం డ్యామేజ్ అయింది. ఈ ప్ర‌మాదంలో నుంచి కూడా అజిత్ సుర‌క్షితంగానే బ‌య‌ట‌ప‌డ్డారు. ఈ రేసింగ్ ఈవెంట్‌లో ఆయ‌న టీమ్ మూడో స్థానంలో నిలిచింది. కాగా, ఈ కోలీవుడ్ స్టార్ హీరోకు రేసింగ్ అంటే అమిత ఇష్టం. అందుకే సినిమా షూటింగ్ లేకుంటే కార్లు, బైక్స్ చ‌క్క‌ర్లు కొడుతుంటారు. మోటార్ సైకిల్ టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు అజిత్ ప్ర‌త్యేకంగా ఓ స్టార్ట‌ప్‌ను కూడా ఏర్పాటు చేశారు.

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Entertainment #Racing #Hero #Ajith #AjithKumar #Thala